జిల్లా, టౌన్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పోలీసు ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్ (పీటీసీ) లో త్వరలో నిర్వహించనున్న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని మంత్రిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పాసింగ్ ఔట్ పరేడ్ కు సంబంధించిన అధికారిక ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేసి, కార్యక్రమ వివరాలను తెలియజేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న నూతన పోలీస్ సిబ్బంది పాసింగ్ ఔట్ పరేడ్ లో పాల్గొననున్నారని, వారిని ఉద్దేశించి మంత్రి ప్రసంగించి శుభాకాంక్షలు తెలియజేయాలని అధికారులు కోరారు.












