జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు, మదనపల్లె మహిళా డిగ్రీ కళాశాలలో శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు మహిళా భద్రత, రక్షణ చర్యలు, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
శక్తి టీమ్ సభ్యులు విద్యార్థినులకు మహిళా భద్రత, రక్షణ చర్యలు, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు. ఆకతాయిల వేధింపులు ఎదురైనా లేదా అత్యవసర ఆపద సమయాల్లో ఉన్నా, విద్యార్థినులు ఏమాత్రం భయపడకుండా వెంటనే డయల్ 112 లేదా శక్తి యాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. శక్తి యాప్‌ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలని, ఆపద సమయంలో ఒక్క క్లిక్‌తో పోలీసులు అక్కడికి చేరుకుంటారని తెలిపారు. సైబర్ నేరాలు, ఆన్ లైన్ మోసాల పట్ల విద్యార్థినులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలు, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దని భద్రతా చర్యలను వివరించారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహిళలు, యువతుల రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని, కళాశాలలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతుందని తెలిపారు. మహిళలను వేధింపులకు గురి చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.












