బాల్కొండ, 5 September
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి నివాళులర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల * లో ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు* , : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భారత మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి విజయ భాస్కర్ రెడ్డి మరియు ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రతి ఉపాధ్యాయుడు పని చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలోని 25 ఉపాధ్యాయులందరినీ శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సూపర్ ఇండెంట్ బ్రహ్మదండి రమణ ,, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ లత, సీనియర్ ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.- బట్టు రాజేశ్వర్ ప్రధానోపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల












