కామారెడ్డి, 5 September
జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్రియాల్ గ్రామంలో జరిగిన కిరాణా దుకాణం చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఒక మహిళను అరెస్ట్ చేసి, చోరీకి గురైన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కిరాణా దుకాణంలో చోరీ కేసు ఛేదన.. మహిళ అరెస్ట్ జిల్లా సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుప్రియాల్ గ్రామంలో కిరాణా దుకాణంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించి మహిళా నిందితురాలిని అరెస్ట్ చేశారు. గ్రామానికి చెందిన చౌకి రామచంద్రం తన దుకాణానికి తాళం వేసి కుటుంబ కార్యక్రమానికి వెళ్లగా, తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి కిరాణా సరుకులు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారంతో విచారణ జరిపి కుప్రియాల్‌కు చెందిన సమాల గంగామణి అలియాస్ మానెవ్వ (42)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె నేరాన్ని అంగీకరించగా, ఆమె చూపిన ప్రదేశం నుంచి చోరీకి గురైన 5 కిలోల చక్కెర, సబ్బులు, డిటర్జెంట్లు, కొబ్బరి నూనె, కాల్గేట్, ఇతర కిరాణా సామగ్రితో పాటు రూ.1,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితురాలిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించగా, కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ పుష్పరాజ్‌తో పాటు పోలీసు సిబ్బందిని ఎల్లారెడ్డి డీఎస్పీ అభినందించారు. అలాగే దుకాణాలు, ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సదాశివనగర్ పోలీసులు ప్రజలకు సూచించారు.












