ప్రోత్సహించాలని (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 11
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని , కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసి, కాలుష్య నియంత్రణ పోస్టర్లను ఆవిష్కరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మట్టి గణపతి వినియోగాన్ని ప్రోత్సహించాలి కాలుష్య నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాల వినియోగాన్ని ప్రజలు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. అలాగే కాలుష్య నియంత్రణకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందన్నారు. మట్టి గణపతి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూనే పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. మట్టి గణపతి విగ్రహాల వినియోగం వల్ల నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చని, ప్రజలు పర్యావరణహితమైన విగ్రహాలను ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు. మట్టి విగ్రహాల వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, బీసీ సంక్షేమ అధికారి నర్సయ్య, సహాయ సంక్షేమ అధికారి చక్రధర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










