క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ తీసుకునే రోగులు ఎదుర్కొనే వికారం, వాంతుల సమస్యలకు స్టెరాయిడ్లకు ప్రత్యామ్నాయంగా ఒలాంజపైన్ను ఉపయోగించవచ్చని ఒక కొత్త అధ్యయనం సూచిస్తోంది. భారతీయ వైద్య కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరిశోధన, స్టెరాయిడ్ రహిత చికిత్స ప్రామాణిక డెక్సామెథాసోన్‌తో సమానంగా పనిచేస్తుందని తెలిపింది.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ వల్ల రోగులు వికారం, వాంతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వీటిని నియంత్రించేందుకు ప్రస్తుతం డెక్సామెథాసోన్ వంటి కార్టికోస్టెరాయిడ్లను ఉపయోగిస్తున్నారు. అయితే స్టెరాయిడ్లకు బదులుగా ఇతర మందులను ఉపయోగించవచ్చా, కీమోథెరపీ సమయంలో వాంతులను నియంత్రించడంలో అవి ఎంతవరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి అనే అంశాలపై కొత్త అధ్యయనం పరిశీలించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భారత్‌లో నిర్వహించిన మూడో దశ క్లినికల్ పరిశోధనలో స్టెరాయిడ్ రహిత ఔషధ విధానాన్ని ప్రామాణిక డెక్సామెథాసోన్ ఆధారిత చికిత్సతో పోల్చారు. ఈ అధ్యయనంలో ఒలాంజపైన్ ఆధారిత చికిత్స విధానం కీమోథెరపీతో వచ్చే వాంతులను నియంత్రించడంలో ప్రామాణిక చికిత్సకు తక్కువేమీ కాదని పరిశోధకులు గుర్తించారు. అయితే ఈ ఫలితాలను విస్తృతంగా నిర్ధారించేందుకు మరిన్ని పరిశోధనలు అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.












