రాజంపేట పట్టణంలోని 5వ వార్డు పాఠశాల విద్యార్థులకు డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య పరీక్షా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దంత పరీక్షలు చేసి, టూత్ పేస్ట్, బ్రష్‌లతో కూడిన కిట్లను పంపిణీ చేశారు.
రాజంపేట పట్టణంలోని కొలిమి వీధిలో ఉన్న 5వ వార్డు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు ప్రముఖ దంత వైద్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ లయన్ డాక్టర్ దగ్గుపాటి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శిబిరంలో విద్యార్థులందరికీ దంత పరీక్షలు నిర్వహించి, వారికి టూత్ పేస్ట్, బ్రష్‌లతో కూడిన కిట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం, ప్రతిరోజూ దంతాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, దంత సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ నవీన్ కుమార్ విద్యార్థులకు వివరించారు.












