విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. నున్న సీఐగా విధులు నిర్వహిస్తున్న అలీ, శనివారం బందోబస్తు విధుల్లో ఉండగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతితో పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నెలకొంది.
వివరాల ప్రకారం, నున్న సీఐగా పనిచేస్తున్న అలీ శనివారం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్ వద్ద బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలారు. గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
వెంటనే తోటి సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.












