జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని భవిత సెంటర్లో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు, దివ్యాంగులకు విద్యా ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉపకరణాలను పంపిణీ చేశారు.
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న భవిత సెంటర్లో సమగ్ర శిక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు, దివ్యాంగులకు విద్యా ఉపకరణాల ఉచిత పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చదిపిరాళ్ళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన విద్యా ఉపకరణాలను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.












