జిల్లాలో అక్రమ మద్యం తయారీ, అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు, కుప్పం సబ్-డివిజన్ శ్రీ హేమంత్ బొడ్డు ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని యానాది కాలనీ, గుడ్డూరు అటవీ ప్రాంతాల్లో కుప్పం రూరల్ సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌లో రాళ్లబూదుగూరు ఎస్ఐ శ్రీ నరేష్, రామకుప్పం ఎస్ఐ శ్రీ మరెప్ప మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అటవీ ప్రాంతంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించగా, అక్రమంగా సారా తయారీకి నిల్వ ఉంచిన సుమారు 5,000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించారు. వెంటనే దానిని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీకి ఉపయోగించే సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు.












