తిరుపతిలో ఆస్తి వివాదం తీవ్రమైంది. కన్నతల్లిపైనే కొడుకులు, కోడలు దాడికి పాల్పడిన ఘటన బైరాగిపట్టెడలో చోటుచేసుకుంది. తమ పేరున స్థలం రాయాలని వేధింపులకు గురిచేస్తూ, దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బైరాగిపట్టెడకు చెందిన శాంతమ్మ భర్త పేరున ఉన్న 13 అంకణాల స్థలం ఆయన మరణానంతరం ఆమె పేరున నమోదైంది. అయితే, ఈ స్థలాన్ని తమ పేరున రాసివ్వాలని పెద్ద కొడుకు చంద్రశేఖర్, కోడలు ఈశ్వరమ్మ, చిన్న కొడుకు రావణ కుమార్ కొంతకాలంగా శాంతమ్మను వేధిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఆస్తిని తమకు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని శాంతమ్మ ఆరోపించారు. తాజాగా, ఆస్తి కోసం ముగ్గురూ కలిసి ఆమెపై దాడి చేశారు. ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంతమ్మ, విసుగు చెంది తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.












