కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ లోని ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పట్టణ ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ లోని ఆర్యవైశ్య అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం వాసవి సేవాదళ్ అధ్యక్షులు మహంకాళి విజయ్, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ రిజినల్ చైర్మన్ గౌరీ శంకర్, పాతశివ కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్యవైశ్య అభివృద్ధి కమిటీ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రజలకు ముందస్తుగా బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య అభివృద్ధి కమిటీ సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి రమణ, ప్రధాన కార్యదర్శి నంగునురి వెంకటేశం, ఉపాధ్యక్షులు ఎనిశెట్టి శ్రీనివాస్, ఎర్రం నాగరాజు, వెంకటరాజు, సహాయ కార్యదర్శులు బాలరాజు, మురికి రాజు, తృప్తి అనిల్, పాత ధర్మరాజు, లాబిశెట్టి శ్రీనివాస్, దోమకొండ రామకోటి, పసునూరి వెంకటరాజుతో పాటు ఆర్యవైశ్య అభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











