నగరంలో వైసీపీ ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది. అమీన్ పీర్ దర్గా ప్రాంతంలో వైసీపీ మాజీ కార్పొరేటర్ షంషీర్‌పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రచార కార్యక్రమానికి వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల హాజరయ్యారు. ప్రచారం సాగుతుండగానే సయ్యద్ భాష అనే వ్యక్తి అక్కడికి వచ్చి మాజీ కార్పొరేటర్ షంషీర్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో షంషీర్ చేతికి గాయమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
గాయపడిన కార్పొరేటర్‌కు చికిత్స












