స్థానిక సంస్థల ఎన్నికల తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఫుట్ పెట్రోలింగ్, పోలింగ్ కేంద్రాల తనిఖీలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, ముందస్తు బందోబస్తు చర్యలను ముమ్మరం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచుతూ శాంతిభద్రతల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పోలీస్ అధికారులు కేటాయించిన సిబ్బందితో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిబ్బందిని అప్రమత్తం చేస్తూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.











