కడప నగర మేయర్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి దీప్తికి మద్దతుగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.
కడప నగరంలోని 48, 49, 50వ డివిజన్లలో బుధవారం అంజాద్ భాష ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటర్నేషనల్ కళ్యాణమండపం, కేసీ కెనాల్ కట్ట, అగాడి వీధి, యానాది కాలనీ, బిస్మిల్లా నగర్ ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిసి, పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా అంజాద్ భాష మాట్లాడుతూ, కడప నగరంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఉన్న శక్తివంతమైన ఆయుధమని, ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన పేర్కొన్నారు.











