పోలీస్ శాఖ పనితీరులో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం రాజంపేట పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు.
ముందుగా పోలీసుల పరేడ్‌ను పరిశీలించి, సిబ్బందికి విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని కేసు ఫైళ్లు, ఎఫ్ఐఆర్లు, క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు, పెండింగ్ కేసుల వివరాలను పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, బాధితులకు సత్వర న్యాయం అందించాలని సూచించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.












