జిల్లాలో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భావించిన భర్త, తన స్నేహితుడితో కలిసి ఆ వ్యక్తిని హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
మాలెపాడు గ్రామంలోని ఆవులపల్లెకు చెందిన ఆవుల నరసింహులు (45) మ్యాజిక్‌లు చేస్తూ జీవనం సాగించేవాడు. దిన్నెమీద గ్రామానికి చెందిన నాగరాజు కుటుంబంతో అతడికి పరిచయం ఉంది. ఈ క్రమంలో తన భార్య గంగాదేవితో నరసింహులు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని నాగరాజు అనుమానించాడు. ఈ అనుమానంతోనే నరసింహులును హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
నాగరాజు, నరసింహులును మంత్రాలు చేయాలని చెప్పి జిల్లా శ్రీనివాస మంగాపురం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తన స్నేహితుడు ముదిరాజుతో కలిసి షూ లేసుతో గొంతు బిగించి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టినట్లు సమాచారం.











