కామారెడ్డి, 2026-08-02
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రోగ్రాం కామారెడ్డి జిల్లాలో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా యువతతో వర్చువల్‌గా సంభాషించారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నషా ముక్త్ భారత్ (వ్యసన రహిత భారతం) కార్యక్రమంలో భాగంగా, నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ ప్రోగ్రాం కామారెడ్డి జిల్లాలో ఘనంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యావత్ భారతదేశంలోని సుమారు కోటి మందికి పైగా యువతతో వర్చువల్ విధానం ద్వారా ముఖాముఖిగా కనెక్ట్ అయ్యారు. కామారెడ్డి జిల్లా స్థాయి కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల వేదికగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వ్యసనాలకు దూరంగా ఉంటూ కెరీర్‌పై దృష్టి పెట్టాలి: ప్రధానమంత్రి
వర్చువల్ వేదిక ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ యువతను ఉద్దేశించి ప్రసంగించారు. నషా ముక్త్ భారత్ నిర్మాణానికి యువత అంతా నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత జెన్ జీ ( ) తరం యొక్క ఆకాంక్షలు, కలలు నెరవేరాలంటే విద్యార్థులు తమ చదువు, కెరీర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కుటుంబంలోని పెద్దలందరి అనుభవాలు, సూచనలను స్వీకరిస్తూ జీవితంలో ముందుకు సాగాలే తప్ప, ఎలాంటి దుర్వ్యసనాల బారిన పడి జీవితాలను పాడుచేసుకోవద్దని ఆయన హితవు పలికారు.










