జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం రీజనల్ కోఆర్డినేషన్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. పార్టీని మరింత బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశానికి రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి సుధ, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, గోవిందరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, రఘురామిరెడ్డితో పాటు ఎస్ఈసీ, సీఈసీ మెంబర్లు హాజరయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు వెళ్లాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.











