సెప్టెంబర్ నెలలో ఆకాశ వీక్షకులకు పలు అద్భుత ఖగోళ దృశ్యాలు కనువిందు చేయనున్నాయి. చంద్రుడు, ప్రకాశవంతమైన శుక్రుడు, ఎర్రటి నక్షత్రం యాంటారెస్, ధనుస్సు రాశిలోని టీ పాట్ నక్షత్ర సమూహం, శని గ్రహం, నెప్ట్యూన్‌తో పాటు హార్వెస్ట్ మూన్‌ను వీక్షించే అవకాశాలు ఉన్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది.
శుక్ర గ్రహం ప్రకాశవంతంగా
సెప్టెంబర్‌లో శుక్ర గ్రహం సాయంత్రపు ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించనుంది. సూర్యాస్తమయం కొద్దిసేపటి తర్వాత పశ్చిమ దిక్కులో, హోరిజన్కు కొద్దిగా ఎత్తులో శుక్రుడు ప్రకాశవంతమైన కాంతిబిందువులా కనిపిస్తాడు. ఇతర నక్షత్రాల కంటే ఇది చాలా ప్రకాశంగా ఉండటంతో సులభంగా గుర్తించవచ్చని నాసా తెలిపింది. పశ్చిమ దిశలో స్పష్టమైన హోరిజన్ ఉన్న ప్రాంతం నుంచి వీక్షిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
చంద్రుడి కదలికలను అనుసరిస్తూ యాంటారెస్, ధనుస్సు రాశి నక్షత్ర సమూహాలను గుర్తించడం నుంచి శుక్రుడి ప్రకాశాన్ని చూడటం, విషువత్ను గమనించడం, హార్వెస్ట్ మూన్తో పాటు శనినెప్ట్యూన్లను పరిశీలించడం వరకు సెప్టెంబర్‌లో ఆకాశ వీక్షకులకు పలు అవకాశాలు అందుబాటులో ఉన్నాయని నాసా తెలిపింది.











