కడప, 13 September
జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని అడ్వకేట్ డేవిడ్ వినోద్, షేక్ రహంతు బాషా లు అధికారులను కోరారు. నిధుల దుర్వినియోగం, క్రీడాకారుల ఎంపికలో పక్షపాతం వంటి ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి. అడ్వకేట్ డేవిడ్ వినోద్, షేక్ రహంతు భాష డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ డాక్షిన్ టైమ్స్ . జిల్లా క్రికెట్ అసోసియేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని అడ్వకేట్ డేవిడ్ వినోద్, రహంతు బాషా లు అధికారులను కోరారు. ఆదివారం నగరంలోని వైయస్సార్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి వస్తున్న ఫండ్స్ తోపాటు క్రికెట్ లో జరిగే సెలక్షన్ అండర్ 14, 16, 19, 23 సీనియర్స్ క్రీడాకారుల ఎంపికలో నిపులునైన ఆటగాళ్లను సరైన వారిని ఎంపిక చేయడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ ఎంపికలో పక్షపాత వైఖరి విధి విధానాలు పాటించకుండా అసోసియేషన్ మెంబర్స్ ఎలక్షన్ లేకుండా ఎంపిక చేయడం జరిగింది కాదన్నారు. వైయస్సార్ క్రికెట్ స్టేడియం వెలివేషన్ ఫ్లడ్ లైట్ విషయంలో కూడా అక్రమాలు జరిగాయి అన్నారు. అసోసియేషన్‌లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేటప్పుడు ఇతర జిల్లా రాష్ట్ర ప్లేయర్స్ కి జిల్లా ప్లేయర్స్ గా చూపించి ఆడించడం సరైనది కాదన్నారు. క్రికెట్ అసోసియేషన్ బైలాస్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు అసోసియేషన్ మెంబెర్ గా ఉండకూడదు కానీ ప్రస్తుత అసోసియేషన్ లో ప్రభుత్వ ఉద్యోగులు వ్యాపారవేత్తలు మెంబర్స్ గా చలామణి అవుతున్నారన్నారు. క్రికెట్ అసోసియేషన్ లో ఫైనాన్షియల్ లో ఇది ఇరెగ్యులేషన్స్ని దుర్వినియోగం చేయుచున్న అసోసియేషన్ యొక్క బైలాస్ ని అమలుపరచకుండా జరుగుతున్న అక్రమాల పైన విచారణ జరిపించి ప్రస్తుత అసోసియేషన్ మార్చి తిరిగే ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని జిల్లా వాసుల అందరి తరపున మేము విన్నవించుకుంటున్నామన్నారు. అసోసియేషన్‌లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీసీసీఐ ఏసీఏ నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్ ఎమ్మెల్యే మాధవరెడ్డి క్రికెట్ అసోసియేషన్ కు విన్నవించుకోవడం జరిగిందన్నారు.












