ఆర్మూరు (డాక్సిన్ టైమ్స్) సెప్టెంబర్ 11
మండలంలోని ఫతేపూర్ గ్రామానికి చెందిన ఒక చిన్న రైతు, పీఎం కిసాన్ (-) పథకం కింద అందాల్సిన డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే డబ్బులు వచ్చి, ఆ తర్వాత నిలిచిపోయాయని తెలిపారు. తన వద్ద ఈ-కేవైసి రిజిస్టర్ అయినప్పటికీ, భూమి పత్రాలు సరిగ్గా ఉన్నప్పటికీ డబ్బులు ఆగిపోవడంపై రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*పీఎం కిసాన్ సమస్యపై చిన్న రైతు ఆవేదన* మండలంలోని ఫతేపూర్ గ్రామంలో నేను ఒక చిన్న రైతును. గత కొంతకాలంగా మాకు పీఎం కిసాన్ (PM-KISAN) పథకానికి సంబంధించిన డబ్బులు రావడం లేదు. ప్రారంభంలో కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే డబ్బులు వచ్చాయి, ఆ తర్వాత నిలిచిపోయాయి. నా వద్ద పీఎం కిసాన్ ఈ-కేవైసి (e-KYC) రిజిస్టర్ అయి చూపిస్తోంది. భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు కూడా స్పష్టంగా, సరిగ్గా ఉన్నాయి. అయినప్పటికీ, ఏ సాంకేతిక కారణాల వల్ల లేదా ఇతర సమస్యల వల్ల మా డబ్బులు ఆగిపోయాయో అర్థం కావడం లేదు. గతంలో ఎందరో అధికారులు వస్తున్నారు, పోతున్నారు. ప్రస్తుతం కూడా అధికారులను సంప్రదించినా ఎవరూ సరైన సమాచారం ఇవ్వడం లేదు, సమస్యను పరిష్కరించడం లేదు. అన్ని అర్హతలు ఉండి కూడా, కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇబ్బంది పడుతున్న ఒక చిన్న రైతు ..!











