దారి వివాదంలో మహిళపైకి ట్రాక్టర్ ఎక్కించి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడికి మదనపల్లె 7వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పు గురువారం వెలువడింది.
చౌడేపల్లి మండలం, దిగువపల్లె పంచాయతీ కొలింపల్లె గ్రామానికి చెందిన పాశం నాగరాజ (45) కు, అదే గ్రామానికి చెందిన ఫిర్యాదుదారులకు మధ్య ఇంటి స్థలం, రహదారికి సంబంధించి గొడవలు ఉన్నాయి. ఈ క్రమంలో 07.09.2023 న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో.. అడ్డువచ్చిన ఫిర్యాదుదారుడి భార్య యనమల సావిత్రమ్మను అంతమొందించాలనే దురుద్దేశంతో నిందితుడు నాగరాజ తన ట్రాక్టర్ (036863), ట్రైలర్ (036894) తో ఆమెపైకి వేగంగా దూసుకెళ్లాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ దారుణ ఘటనలో ట్రాక్టర్ ఆమె ఎడమ కాలు, ఛాతి భాగం పైనుంచి వెళ్లడంతో పలు ఎముకలు విరిగిపోయాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ అసిస్టెంట్ సర్జన్ డా. ఎం.జి. రాజ్ కిషోర్ ప్రాథమిక చికిత్స అందించి, ఇవి తీవ్రమైన గాయాలుగా ధృవీకరిస్తూ మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి రిఫర్ చేశారు. అదృష్టవశాత్తూ ఆమె ప్రాణాపాయం నుండి బయటపడింది.












