వై.ఎస్.ఆర్ కడప, 2026-09-12
రెడ్డివారిపల్లి గ్రామంలో ఈ నెల 8న జరిగిన గొంగటి రాధ హత్య కేసులో ఆమె భర్త గొంగటి నాగార్జున కరుణను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన రాయి, కట్టెను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హత్య కేసులో నిందితుడి అరెస్టు.. -హత్యకు ఉపయోగించిన రాయి, కట్టె స్వాధీనం. డిస్ట్రిక్ట్ బ్యూరో చీఫ్ కడప డాక్షిన్ టైమ్స్ : రెడ్డివారిపల్లి గ్రామంలోని మాలపల్లిలో ఈ నెల 8వ తేదీన గొంగటి రాధ హత్యకు గురైన కేసులో నిందితుడైన ఆమె భర్త గొంగటి నాగార్జున @ కరుణను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నేడు అనగా 12.09.2026 మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బి.టి.పల్లి గ్రామ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆర్.కె. వ్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి.శంకర్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి హత్యకు ఉపయోగించిన రాయి మరియు కట్టెను పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ హత్య కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆ కోణంలోనూ పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వెల్లడయ్యే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని సి.ఐ. శంకర్ రెడ్డి తెలిపారు.











