కామారెడ్డి, 8 September
పాదం, మడమ సమస్యలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవని యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజి హెచ్చరించారు. మధుమేహం, క్రీడా గాయాలు, తరచుగా బెణకడం వంటి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పాదం–మడమ నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు: ఆధునిక చికిత్సలతో వేగంగా కోలుకునే అవకాశం పాదం, మడమ సమస్యలను చిన్నవిగా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) కన్సల్టెంట్ ఫుట్ అండ్ యాంకిల్ సర్జన్ డాక్టర్ ఆదిత్య సోమయాజి తెలిపారు. మడమ నొప్పి, తరచుగా బెణకడం, పాదం ఆకృతి మారడం, క్రీడా గాయాలు, మధుమేహం వల్ల వచ్చే పాద సమస్యలను వయస్సు కారణంగా వచ్చినవిగా భావించి వదిలేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం అధునాతన స్కానింగ్ ద్వారా సమస్యను ఖచ్చితంగా గుర్తించి, కనీస కోత శస్త్రచికిత్సలు, 3డీ ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించిన ఆధునిక ఇంప్లాంట్లు, యాంకిల్ జాయింట్ రీప్లేస్మెంట్ వంటి అత్యాధునిక చికిత్సలతో క్లిష్టమైన పాద, మడమ సమస్యలకు సమర్థవంతమైన చికిత్స అందుబాటులో ఉందన్నారు. ఆధునిక ఫిజియోథెరపీతో రోగులు త్వరగా కోలుకుని రోజువారీ పనులు, ఉద్యోగం, క్రీడల్లోకి తిరిగి రావచ్చని చెప్పారు. సరైన సైజు, సపోర్ట్ ఉన్న చెప్పులు ధరించడం, మధుమేహ రోగులు ప్రతిరోజూ పాదాలను పరిశీలించుకోవడం, చిన్న నొప్పి లేదా వాపు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్రమైన సమస్యలను, శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చని డాక్టర్ ఆదిత్య సోమయాజి సూచించారు.











