కడప జిల్లా పోరుమామిళ్ల సమీపంలోని మండలం సావిశెట్టిపల్లెలో వివాహేతర సంబంధం ఆరోపణలతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో 14 మంది గాయపడటంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
సావిశెట్టిపల్లెలో వివాహేతర సంబంధం ఆరోపణల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగింది. వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో 14 మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. మరో వ్యక్తి ఓబయ్యను మెరుగైన చికిత్స కోసం వేలూరు ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.











