జిల్లా రామేశ్వర్‌పల్లి గ్రామంలో జన్మించిన నవజాత శిశువుకు అంబులెన్స్‌లోనే సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. ఉమ్మనీరు మింగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన శిశువును మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలిస్తుండగా, అంబులెన్స్‌లోనే వైద్య సిబ్బంది చికిత్స అందించారు.
జిల్లా రామేశ్వర్‌పల్లి గ్రామానికి చెందిన రేష్మ బేగంకు శనివారం ఉదయం 10.30 గంటలకు మూడో కాన్పులో మగబిడ్డ జన్మించాడు. అయితే, శిశువు ఉమ్మినీరు మింగడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు కొంతసేపు చికిత్స అందించినప్పటికీ, శిశువు శ్వాస రేటు తగ్గడంతో పాటు నాడి స్పందన కూడా తక్కువగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్‌కు రిఫర్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీంతో, నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లో నుంచి నిజామాబాద్‌కు తరలించారు. ప్రయాణ సమయంలో అంబులెన్స్‌లోనే అవసరమైన చికిత్స అందించడంతో శిశువు పరిస్థితిలో కొంత మెరుగుదల కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం శ్వాసకు సంబంధించిన ఇబ్బంది స్వల్పంగా ఉన్నట్లు పేర్కొన్నారు.












