వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటం 11వ బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెడుతున్న నూతన కానిస్టేబుళ్లకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సమాచార దీపికలను అందజేశారు. రాష్ట్ర డీజీపీ రూపొందించిన ఈ దీపికలు పోలీసు విధులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, మార్గదర్శకాలతో కూడి ఉన్నాయి.
జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ ఈ దీపికలను కానిస్టేబుళ్లకు అందించారు. వీటిలో ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలు, నిబంధనలు వంటి కీలక సమాచారం ఉందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
విధి నిర్వహణలో ఈ సమాచారాన్ని ఉపయోగించుకోవాలని ఎస్పీ నూతన కానిస్టేబుళ్లను సూచించారు. పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు.












