డిగ్రీ, బీటెక్ విద్యార్థుల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమం, ఈబీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి సవితకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తి నిధులను విడుదల చేయాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది.
కడప నగరంలోని స్థానిక ఆర్‌అండ్‌వీ గృహంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం అందజేయబడింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం రూ.1,800 కోట్లకు జీవో జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకు సుమారు రూ.600 కోట్లు మాత్రమే విడుదల చేసిందని పీడీఎస్‌యూ పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
202526 విద్యా సంవత్సరానికి సంబంధించి చివరి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే నిధులు విడుదల చేసి, మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు నిధులు విడుదల చేయలేదని తెలిపింది. దీంతో విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు.












