కడప, 8 September
జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడింపల్లి ప్రాంతంలో ఆన్లైన్లో మట్కా జూదం నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ బాషా అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.7,000 నగదు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
జిల్లాలో మట్కా నిర్వాహకుడి అరెస్ట్ ₹7,000/- నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడింపల్లి ప్రాంతంలో ఆన్లైన్లో “మట్కా” జూదం నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సి.ఐ. కొండారెడ్డి ఆధ్వర్యంలో, ఎస్.ఐ. మొయినుద్దీన్ తన సిబ్బంది నడింపల్లి ప్రాంతంలో చేపట్టిన చర్యల్లో ఆన్లైన్లో మట్కా జూదం నిర్వహిస్తున్న షేక్ మహబూబ్ బాషాను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి రూ.7,000 నగదు మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సి.ఐ. కొండారెడ్డి మాట్లాడుతూ, ఆన్లైన్ మట్కా, జూదం, బెట్టింగ్‌లతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు జూదం, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, తమ ప్రాంతాల్లో ఎవరైనా మట్కా లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు.












