కామారెడ్డి, 12 September
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన 1వ పారా కిక్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా గూడెం గ్రామానికి చెందిన గుడుగుల అరవింద్ కుమార్ తెలంగాణకు స్వర్ణ పతకాన్ని అందించారు. 1 కేటగిరీలో పోటీ పడిన ఆయన ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అరవింద్‌కు స్వర్ణ పతకం టౌన్, సెప్టెంబర్ 12 (ప్రజాజ్యోతి): మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో సెప్టెంబర్ 11న నిర్వహించిన WAKO 1st Para Kickboxing Championshipలో జిల్లా గూడెం గ్రామానికి చెందిన గుడుగుల అరవింద్ కుమార్ అద్భుత ప్రతిభ కనబరిచి తెలంగాణకు స్వర్ణ పతకం అందించారు. P1 కేటగిరీలో పోటీ పడిన అరవింద్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నారు. ఈ జాతీయ స్థాయి పోటీల్లో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం 12 మంది క్రీడాకారులు పోటీ పడగా, తెలంగాణ తరఫున బరిలోకి దిగిన అరవింద్ కుమార్ P1 కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి స్థానాన్ని సాధించారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి స్వర్ణ పతకం సాధించడం పట్ల జిల్లా క్రీడాభిమానులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. అరవింద్ విజయం తెలంగాణతో పాటు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ తన విజయానికి సహకరించిన కోచ్, టీమ్ సభ్యులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, తనను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెలంగాణకు మరింత పేరు తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. ఇండోర్ నుంచి విజేతల బృందం సెప్టెంబర్ 15న కి చేరుకోనుంది. బృందంలో స్వర్ణ పతక విజేత, అథ్లెట్ గుడుగుల అరవింద్ కుమార్, కోచ్ ఆశమ్మల సూర్య ప్రసాద్, టీమ్ సభ్యులు అర్జున్ ఆర్య, ఉదయ్ కుమార్ ఉన్నారు.











