యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, చెడు వ్యసనాలకు, సైబర్ మోసాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీస్ కార్యాలయం సూచించింది. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవి గార్డెన్లో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
యువత పెడదారి పట్టకుండా సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలని, ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రేమ పేరుతో జరిగే మోసాలు, మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, మహిళల భద్రత, పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, తెలియని వ్యక్తులను నమ్మి మోసపోవద్దని, మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల సూచనలు పాటిస్తూ ఉన్నత లక్ష్యాలతో చదువుకోవాలని, చిన్న తప్పిదాలు కూడా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని వివరించారు.












