జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సీసీ విభాగం ఆధ్వర్యంలో నషా ముక్త్టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, టీబీ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు తమ పరిసర ప్రాంతాలు, గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధ్యాపకులు పిలుపునిచ్చారు. టీబీ నివారణపై ప్రత్యేక అవగాహన వీడియోలను రూపొందించారు. ఆర్కే విద్యాసంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో చదువుతో పాటు దేశభక్తి, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యమన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనంతరం డ్రగ్స్ వద్దుజీవితం ముద్దు అనే నినాదంతో విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీన్ నవీన్, ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి, ఏఓ శ్రీధర్, ఎన్సీసీ ఆఫీసర్ శ్రీకాంత్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ లింగం, అధ్యాపకులు, ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.












