యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా () జిల్లా తొలి మహాసభ మదనపల్లెలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహులు మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న 7,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మదనపల్లెలో జరిగిన ఈ మహాసభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహులు హాజరయ్యారు. మహాసభ ప్రారంభంలో జిల్లా అధ్యక్షులు ఆఫ్రిద్ జెండా ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరులకు కూడా ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రభుత్వానికి నరసింహులు సూచనలు












