లింగంపేట్, 12 September
హైదరాబాద్‌లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ బాలు, మండల ఉపాధ్యాయురాలు బుక్క రజని దంపతులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు - 2026ను అందజేశారు. ఈ పురస్కారాలను పలువురు ప్రముఖులు వారికి ప్రదానం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
*రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్న డాక్టర్ బాలు - రజని* వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బాలు మరియు మండల కేంద్రంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న బుక్క రజని దంపతులకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు - 2026 ను వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ, యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్ గుండా మల్లయ్య గుప్త,పవన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రవి గుప్త లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు డాక్టర్ బాలు,బుక్క రజని లు మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపిక చేసిన నిర్వాహకులు కాచం సత్యనారాయణ గుప్తకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అయిపోయిందా ఉపాధ్యాయుడు కేవలం బోధననే కాకుండా విలువలను,సామాజిక సేవా దృక్పథాన్ని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు.












