చిత్తూరు జిల్లాలో జరిగిన కాపర్ వైర్ల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, 15 లక్షల విలువైన 280 కిలోల కాపర్ వైర్లతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, కుప్పం సబ్ డివిజన్ బొడ్డు హేమంత్ పర్యవేక్షణలో, కుప్పం రూరల్ ఇన్స్పెక్టర్ . మల్లేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఈ కేసును ఛేదించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
2018లో గుడుపల్లి మండలం పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలోని కంపెనీలో కాపర్ వైర్లు చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందడంతో గుడుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.












